Ganesh Immersion : వేములవాడలో ఈ నెల 4న గణేష్ నిమజ్జనం

by velandi.Saikiran |   (  Updated:2025-09-01 12:04:53  IST  )

వేములవాడ పట్టణంలో ఈ నెల 4న నిర్వహించే గణేష్ నిమజ్జన వేడుకలకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ అన్వేష

Ganesh Immersion  : వేములవాడలో ఈ నెల 4న గణేష్ నిమజ్జనం
X

దిశ, వేములవాడ టౌన్: వేములవాడ పట్టణంలో ఈ నెల 4న నిర్వహించే గణేష్ నిమజ్జన వేడుకలకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ అన్వేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచనలు, ఆదేశాల మేరకు పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. రూ. 11లక్షలతో ఫ్లడ్ లైట్లు, సీరియల్ లైటింగ్, ఐదు భారీ క్రేన్లు, బారికేడింగ్ తో పాటు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో, పూర్తి ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని ప్రకటనలో కమిషనర్ పేర్కొన్నాడు.

Next Story