- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేములవాడలో ప్రారంభమైన గణేష్ నిమజ్జన వేడుకలు
వేములవాడ పట్టణంలో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది వలే ఈ ఏడాది సైతం గుడి చెరువు వద్ద ఏర్పాటు

దిశ, వేములవాడ టౌన్ : వేములవాడ పట్టణంలో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది వలే ఈ ఏడాది సైతం గుడి చెరువు వద్ద ఏర్పాటు చేసిన ప్రాంగణం వద్ద ఇప్పటికే పదుల సంఖ్యలో వినాయక ప్రతిమలను నిమజ్జనం చేశారు. నిమజ్జన వేడుకల కొరకు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిమజ్జన ప్రాంగణం వద్ద రూ.11లక్షలతో 5 భారీ క్రేన్లు, లైటింగ్, టెంట్లు, సౌండ్ సిస్టమ్ వంటి ఏర్పాట్లు చేశారు.
నిమజ్జన ప్రాంతంలో ఇప్పటికే డాగ్, బాంబ్ స్కాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించగా వైద్య, ఆరోగ్య, అగ్నిమాపక, మత్స్యశాఖ తదితర శాఖల అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా సుమారు 200మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏ.ఎస్పి శేషాద్రిని రెడ్డి తెలిపారు. పూర్తి శాంతియుత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఏ.ఎస్పీ హెచ్చరించారు.






