వైరల్ గా మారిన బాల గణేష్... మొత్తం మట్టితోనే

by velandi.Saikiran |

వినాయక చవితి సందర్భంగా జగిత్యాల శివసేన యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మట్టితో తయారు చేసిన బాల గణ=

వైరల్ గా మారిన బాల గణేష్... మొత్తం మట్టితోనే
X

దిశ, గంగాధర : వినాయక చవితి సందర్భంగా జగిత్యాల శివసేన యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మట్టితో తయారు చేసిన బాల గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ విగ్రహాన్ని జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్ ప్రాంతంలో ప్రతిష్ఠించనున్నారు. ఈ తరుణంలోనే కరీంనగర్ - జగిత్యాల ప్రధాన రహదారి మీదుగా తీసుకువస్తుంటే కొత్తపల్లి సమీపంలో దిశా కెమెరాకు చిక్కింది.

మట్టి తోనే అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ బాల గణేష్ విగ్రహం విలువ సుమారు రూ.80 వేల వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. విగ్రహం తరలింపులో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివసేన యూత్ నాయకులు మాట్లాడుతూ, “ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలకే ప్రాధాన్యం ఇస్తున్నాం. పర్యావరణానికి హాని కలగకుండా సంప్రదాయ పద్ధతిలోనే ఉత్సవాలను జరుపుకుంటాం” అని తెలిపారు. ఈ బాల గణేష్ విగ్రహం రహదారి వెంబడి స్థానికులు ఆసక్తిగా వీక్షించారు.

Next Story