- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
55 సార్లు రక్తదానం చేసిన గాలిపెల్లి కుమార్
స్వార్థం లేకుండా సమాజానికి సేవ చేయాలనే తపన ఉన్నవారే నిజమైన హీరోలు. అలాంటి యువకుడే కరీంనగర్ బొమ్మకల్ డివిజన్ కు చెందిన ప్రజా సేవకుడు మెగా అభిమాని రామ్ చరణ్ యువశక్తి జిల్లా ఇన్ చార్జి గాలిపెల్లి కుమార్.

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : స్వార్థం లేకుండా సమాజానికి సేవ చేయాలనే తపన ఉన్నవారే నిజమైన హీరోలు. అలాంటి యువకుడే కరీంనగర్ బొమ్మకల్ డివిజన్ కు చెందిన ప్రజా సేవకుడు మెగా అభిమాని రామ్ చరణ్ యువశక్తి జిల్లా ఇన్ చార్జి గాలిపెల్లి కుమార్. తన అభిమాన నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినం సందర్బంగా ఇప్పటివరకు 55 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసి పలువురి ప్రాణాలకు ఆశాకిరణంగా నిలిచాడు. గాలిపెల్లి కుమార్ మొదటిసారి తన స్నేహితుడికి అత్యవసర పరిస్థితిలో రక్తదానం చేశాడు. ఆ అనుభవం అతనిలో సేవాభావాన్ని మరింత పెంచింది. అప్పటి నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం ప్రతి 15 రోజులకు ఒక్క సారి రక్త కణాలు దానం చేస్తూ ముందుండే వ్యక్తిగా గుర్తింపు పొందాడు.
"రక్తదానం వల్ల ఎవరికైనా ప్రాణం నిలుస్తుందనే భావన నాకు ఎంతో సంతృప్తి ఇస్తుంది. మనం ఇచ్చేది కొద్ది నిమిషాల సమయం మాత్రమే. కానీ అది ఒక కుటుంబానికి జీవితాంతం ఆనందం ఇస్తుంది" అని గాలిపెల్లి కుమార్ చెబుతున్నాడు. అతని సేవా కార్యక్రమాలకు స్థానిక రక్త బ్లడ్ బ్యాంకులు, సేవా సంఘాలు అభినందనలు తెలిపారు. యువత కూడా గాలిపెల్లి కుమార్ ను ఆదర్శంగా తీసుకొని రక్తదానానికి ముందుకు రావాలని ఆయన కోరుతున్నారు. ఆరోగ్యవంతమైన వ్యక్తి సురక్షితంగా రక్తదానం చేయవచ్చని డాక్టర్లు పేర్కొంటున్నారు. రక్తదానం వల్ల శరీరానికి ఎటువంటి హాని ఉండదని వైద్యులు చెబుతున్నారు. కుమార్ వంటి యువకులు సమాజానికి మార్గదర్శకులు. "రక్తదానం మహాదానం" అన్న నానుడిని తన జీవితంలో నిజం చేస్తున్న గాలిపెల్లి కుమార్ కు స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.






