టికెట్ అడిగితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా ?

by velandi.Saikiran |

బిఆర్ఎస్ నాయకుడు మాజీ ఎంపీపీ పాలెపు రాజు ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుట్ల మాజీ

టికెట్ అడిగితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా ?
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు మాజీ ఎంపీపీ పాలెపు రాజు ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సోమవారం ప్రకటించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి మాజీ ఎంపీపీ రాజు హాజరవ్వగా కొద్దిసేపటికే ఆయన బయటకు వచ్చేసారు. ఈ విషయమై మీడియా ఆయనను సంప్రదించగా వచ్చే జడ్పిటిసి ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వాలని అడగడానికి వస్తే నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారని అంటూ తనపై దుర్భాషలాడి అవమానించి బయటకు పంపించేసారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల పార్టీ పట్ల ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై పార్టీ ఆఫీస్ లో ఆమె ఫ్లెక్సీ చింపినందుకే కొందరు తనపై కక్ష కట్టారని అన్నారు. 23 ఏళ్లుగా పార్టీ కోసం సర్వీస్ చేస్తున్నానని తనను జగిత్యాలలో సొంత ఇంటి పేరుతో కన్నా పార్టీ పేరుతోనే గుర్తుపట్టే వాళ్లే ఎక్కువమంది ఉన్నారని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు ఆఫీస్ లో ఉన్న కవిత ఫోటోను కూడా చింపేశారు కదా.. మీరు చేస్తే కరెక్ట్ నేను చేస్తే తప్పా అని ప్రశ్నించారు.

2002 నుండి తాను పార్టీ జెండా మోస్తున్నానని ఇప్పుడున్న వారిలో చాలావరకు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చేరిన వారే ఉన్నారని అన్నారు. తమ అధినేత కెసిఆర్ తమకు కొట్లాడడం మాత్రమే నేర్పాడని ఎవరిని కుట్రలు చేసినా ఖచ్చితంగా పార్టీలోనే ఉండి పనిచేస్తానని అన్నాడు. ఇదిలా ఉండగా బిఆర్ఎస్ వర్గాలు మాత్రం మాజీ ఎంపీపీ రాజు గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతోనే సస్పెండ్ చేసినట్లుగా తెలిపారు.

Next Story