- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి : మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
నీళ్లు,నిధులు, నియామకాలు, ఉద్యమకారుల ఆత్మహత్యలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్

దిశ,హుజూరాబాద్: నీళ్లు,నిధులు, నియామకాలు, ఉద్యమకారుల ఆత్మహత్యలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు అధ్యక్షతన శక్తి కేంద్ర స్ట్రీట్ కార్నర్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ కుటుంబ పాలనలో అప్పులమయమైందన్నారు. 9 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చలేని హామీలను ప్రజా క్షేత్రంలో ఎండ గట్టాలని పిలుపునిచ్చారు.
ధనిక రాష్టంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అప్పులెందుకయ్యాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలు, అమరవీరుల ఆశయ సాధన ,ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని కేసీఆర్ తుంగలో తొక్కారన్నారు. రెండు పర్యాయాలు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఏం సాధిస్తారని దుయ్యబట్టారు. సొంత రాష్ట్రంలో ఎసీడీ చార్జీలు వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉచిత విద్యుత్ సరఫరా చేస్తానని హామీ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల అత్మహత్యలు ఆపలేని సర్కార్ అబ్కీ బార్ - కిసాన్ సర్కార్ ఎలా సాదిస్తుందని ప్రశ్నించారు. మోడీ పాలనలో భారత్ ప్రపంచ దేశాలతో పోటీపడుతూ పురోగమిస్తోందన్నారు. రాజకీయ లబ్ది కోసం చేసే తప్పుడు ఆరోపణలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణా రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కొన్సిలర్ పైళ్ల వెంకట్ రెడ్డి , నాయకులు ఎర్రబెల్లి సంపత్ రావు, బింగి కరుణాకర్, నరసింహ రాజు, మాడుగుల ప్రవీణ్, మాసాడి ముత్యంరావు, జెల్ల సుధాకర్, నల్ల సుమన్, జీడి మల్లేష్ , సంపెల్లి సంపత్ రావు, ఆదిరెడ్డి, సింగిరెడ్డితిరుపతి రెడ్డి, సబ్బని రమేష్ తదితరులు పాల్గొన్నారు.






