సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి లేఖ

by Ratna Kumari |

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి వ‌డ్డేర కార్పొరేష‌న్ కి రాబోయే బ‌డ్జెట్ లో ప్ర‌త్యేక నిధులు కేటాయించాల‌ని బుధ‌వారం లేఖ రాశారు.

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి లేఖ
X

దిశ, జగిత్యాల టౌన్ : వడ్డెర కార్పొరేషన్‌కు రాబోయే బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని బుధవారం మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ సందర్భంగా జీవ‌న్ రెడ్డి మాట్లాడుతూ కుల వృత్తుల కార్పొరేషన్ల ద్వారా వెనుకబడిన కులాలను ప్రోత్సహించేందుకు వడ్డెర సామాజిక వర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని జీవన్ రెడ్డి కోరారు. తెలంగాణలో వడ్డెర కులస్తులు నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషిస్తూ భవనాలు, చెక్‌డ్యామ్‌లు, రోడ్లు, బ్రిడ్జ్‌లు, చెరువులు, కుంటల నిర్మాణంలో శ్రమ అర్పిస్తున్నారని పేర్కొన్నారు. కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి, నైపుణ్య శిక్షణ, ఆధునిక సాంకేతికతలు అందించి కుల వృత్తులను సంరక్షించాలని, రాయితీ పై టిప్పర్‌లు, బ్లేడ్‌లు, ట్రాక్టర్‌లు, భారీ యంత్రాంగం కల్పించాలని సూచించారు. ప్రతి గ్రామ, పట్టణ స్థాయిలో కో ఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేసి ఆర్థిక సహాయం అందించాలని సూచించారు. వడ్డెర కులవృత్తులు సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడి సమాజంలో అన్ని వర్గాలతో అనుబంధాలు ఏర్పరుస్తాయని జీవన్ రెడ్డి తెలిపారు. ఏర్పాటు లక్ష్యాలు సాధించకపోవడం వల్ల కార్పొరేషన్లు ఆశించిన ఫలితాలు రావడం లేదని, బడ్జెట్‌లో చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని లేఖలో కోరారు.

Next Story