- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చర్చిలకు రూ. 1.95 కోట్లు మంజూరు పట్ల హర్షం : టీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకరి కుమార్
మంథని డివిజన్ లోని చర్చిల, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రూ. 1.95 కోట్లు నిధులు మంజూరు చేయడం పట్ల తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకరి కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

దిశ, మంథని : మంథని డివిజన్ లోని చర్చిల, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రూ. 1.95 కోట్లు నిధులు మంజూరు చేయడం పట్ల తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకరి కుమార్ హర్షం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన దిశతో మాట్లాడారు. మంథని నియోజకవర్గ కేంద్రంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరయ్యాయని, మంథని పట్టణంలోని శ్రీపాద కాలనీ సీయోను చర్చి అదనపు గదుల కోసం రూ. 20 లక్షలు, ముత్యాలమ్మ వాడలోని హెబ్రోన్ చర్చ్ నిర్మాణానికి రూ. 20 లక్షలు, బేతేలు గాస్పల్ ప్రేయర్ మినిస్ట్రీస్ చర్చి నిర్మాణానికి రూ. 20 లక్షలు, సూరయ్యపల్లి లోని రోమన్ క్యాథలిక్ చర్చి వద్ద సిమెంట్ రోడ్డు నిర్మాణానికి రూ. 20 లక్షలు, మంథని మండలంలోని అడవి సోమనపల్లి సీయోను చర్చి అదనపు గదులు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ. 10 లక్షలు మంజూరైనట్టు తెలిపారు.
అలాగే మల్లారం కావనేంట్ చర్చ్ అదనపు గదులకు రూ. 10 లక్షలు, దుబ్బపల్లి గ్రామంలోని సత్య శక్తి సువార్త మినిస్ట్రీస్ చర్చి నిర్మాణానికి రూ. 10 లక్షలు, ముత్తారం మండల కేంద్రంలోని కల్వరి క్రీస్తు ప్రార్ధన మందిరం కోసం రూ. 10 లక్షలు, ఖమ్మంపల్లి లోని జీసస్ పవర్ మినిస్ట్రీస్ చర్చ్ నిర్మాణానికి రూ. 10 లక్షలు, రామగిరి మండలం రత్నాపూర్ బేగంపేట ఎక్స్ రోడ్ లో చర్చి నిర్మాణానికి రూ. 10 లక్షలు, కమాన్ పూర్ మండల కేంద్రంలోని శాలిము గాస్పెల్ మినిస్ట్రీస్ చర్చి కమ్యూనిటీ హాల్ కోసం రూ.5 లక్షలు నిధులు మంజూరు అయ్యాయని, మొత్తం మంథని డివిజన్ లో రూ. 1.95 కోట్లు క్రిస్టియన్ మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు నిధులు మంజూరు చేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.






