- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగిత్యాలలో ఫుడ్ పాయిజన్.. ఐదేళ్ల బాలుడికి అస్వస్థత
by Chintha Aamani |
జగిత్యాల పట్టణంలోని తహసిల్ చౌరస్తా వద్దగల ఓ హోటల్ లో దోశ తిన్న ఓ 5 సంవత్సరాల బాలుడు అస్వస్థతకు గురయ్యాడు.

X
దిశ, జగిత్యాల టౌన్: జగిత్యాల పట్టణంలోని తహసిల్ చౌరస్తా వద్దగల ఓ హోటల్ లో దోశ తిన్న ఓ 5 సంవత్సరాల బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే గమనించిన పేరెంట్స్ బాలున్ని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే బాలుడు అస్వస్థతకు గురైనట్టు డాక్టర్లు నిర్ధారించారు. కాగా ఆ హోటల్ ను కొద్ది రోజుల క్రితం ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. ఇక అంతకు ముందు కూడా అదే హోటల్ లో తిన్న పలువురికి తీవ్ర అస్వస్థత కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఈ విషయాలు బయటకు రాకుండా హోటల్ యాజమాన్యం మేనేజ్ చేసిందని విమర్శలు సైతం ఉన్నాయి. నాణ్యత ప్రమాణాలు పాటించని ఇలాంటి టిఫిన్ సెంటర్ లపై మున్సిపల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠినంగా వ్యవహరించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Next Story






