నాణ్యత లేని వస్తువులతో ఆహార పదార్థాలు తయారు

by Nallavelli.Anjaneyulu |

నాణ్యత లేని వస్తువులతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నఓ బార్ అండ్ రెస్టారెంట్, నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగిస్తున్న ఒక బేకరీ, మరో జ్యూస్ సెంటర్ నిర్వాహకులకు రామగుండం నగర పాలక సంస్థ జరిమానా విధించింది.

నాణ్యత లేని వస్తువులతో ఆహార పదార్థాలు తయారు
X

దిశ, గోదావరిఖని : నాణ్యత లేని వస్తువులతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నఓ బార్ అండ్ రెస్టారెంట్, నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగిస్తున్న ఒక బేకరీ, మరో జ్యూస్ సెంటర్ నిర్వాహకులకు రామగుండం నగర పాలక సంస్థ జరిమానా విధించింది. అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) కమిషనర్ జె. అరుణ శ్రీ ఆదేశాల మేరకు రామగుండం నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగం ఆద్వర్యంలో శనివారం లక్ష్మీ నగర్ లోని పలు షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. నాణ్యత లేని వస్తువులతో ఆహార పదార్థాలు తయారు చేయడంతో పాటు నిషేధిత ప్లాస్టిక్ ఉపయోగిస్తున్న లీలా బార్ & రెస్టారెంట్ కు రూ 5,000 , వైష్ణవి స్వీట్స్ & బేకరీకి రూ 3,000 , లిమ్రా ఫ్రూట్ జ్యూస్ సెంటర్ కు రూ 3,000 చొప్పున జరిమానా విధించారు. ఈ తనిఖీల్లో రామగుండం నగర పాలక సంస్థ శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగ భూషణం , సంపత్ , ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ మధుకర్ , జూనియర్ అసిస్టెంట్ చంద్రా రెడ్డి, జవాన్లు దయానంద్, అశోక్ పాల్గొన్నారు.

Next Story