కోనాపూర్ లో అగ్నిప్రమాదం..!

by Ratna Kumari |

కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు 2000 ఈతచెట్లు కాలిపోవడంతో గీత వృత్తి పై ఆధారపడ్డ 31 గౌడ కుటుంబాలు ఉపాధి కోల్పోయారు.

కోనాపూర్ లో  అగ్నిప్రమాదం..!
X

దిశ, కొడిమ్యాల : కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు 2000 ఈతచెట్లు కాలిపోవడంతో గీత వృత్తి పై ఆధారపడ్డ 31 గౌడ కుటుంబాలు ఉపాధి కోల్పోయారు. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ శుక్రవారం బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. నష్టంపై పూర్తి స్థాయి సర్వే నిర్వహించి తక్షణ ఆర్థిక సాయం అందించడంతో పాటు కొత్త ఈతచెట్లు మంజూరు చేసి తాటివనాల పునరుద్ధరణ చేపట్టాలని కోరారు. ఎండాకాలంలో ఇటువంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతి బీఆర్ఎస్ నాయకులు కృష్ణా రావు, వెంకటేశం, స్వామి రెడ్డి, రాజేందర్, సురుగు శ్రీనివాస్, బుర్ర సంతోష్, గౌడ కులస్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు .

Next Story