పది ఎకరాల పామాయిల్ తోట దగ్ధం.. అగ్నికి దగ్నం అయినా వరి కుప్పలు.

by Bhanu |

మండలంలోని పారుపెళ్లి శివారులోని మానేరువాగు పరివాహక ప్రాంతంలో అగ్ని ప్రమాదానికి, ముగ్గురు రైతులకు తీవ్ర నష్టం జరిగింది.

పది ఎకరాల పామాయిల్ తోట దగ్ధం.. అగ్నికి దగ్నం అయినా వరి కుప్పలు.
X

దిశ, ముత్తారం: మండలంలోని పారుపెళ్లి శివారులోని మానేరువాగు పరివాహక ప్రాంతంలో అగ్ని ప్రమాదానికి, ముగ్గురు రైతులకు తీవ్ర నష్టం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మానేరు వాగు పరివాహక ప్రాంతం లో షాక్ సర్క్యూట్ వల్ల జరిగిందా. లేదా ఎవరో చేసిన దుశ్చర్యకు రైతులు వేల్పుల రవికి చెందిన ఒక ఎకరం, వరి కుప్ప,అలాగే చల్ల సదికి చెందిన మూడు ఎకరాల వరి కోసి ఒక దగ్గర కుప్ప వేసుకోగా, ఆ రైతుల సంబంధించిన వరి కుప్పలు మొత్తం 5 ఎకరాలు పూర్తిగా కాలిపోయిందని, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

పామాయిల్ తోట దగ్ధం

పక్కనేవున్న రాపెళ్లి సురేందర్ కు చెందిన10 ఎకరాల పామాయిల్ తోట 302 చెట్లుపూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి అన్నారు చుట్టుపక్కల రైతులు వచ్చి మంటలను చల్లార్చారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు బాధిత రైతులు ఆదుకోవాలని అన్నారు..



Next Story