- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమతులు కొంచెం.. తవ్వకాలు ఘనం
హుజూరాబాద్ మండలం సిరసపల్లి శివారు లోని పాండవుల గుట్ట ప్రాంతం లోని గుట్టలను రోడ్డు నిర్మాణ సంస్థ డీబీఎల్కంపెనీ వరుస పెట్టి మింగేసింది.

దిశ, హుజూరాబాద్: హుజూరాబాద్ మండలం సిరసపల్లి శివారు లోని పాండవుల గుట్ట ప్రాంతం లోని గుట్టలను రోడ్డు నిర్మాణ సంస్థ డీబీఎల్కంపెనీ వరుస పెట్టి మింగేసింది. అనుమతుల పేరిట నామ మాత్రంగా తీసుకొని పరిధి దాటి బండ రాయి తీయడమే కాకుండా ఓబీ పేరిట కోట్ల రూపాయల మట్టి తవ్వకాలు జరిపి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టింది. పై నుంచి కింది స్థాయిలో అధికారులను మచ్చిక చేసుకున్న సదరు సంస్థ విచ్చల విడిగా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించింది. అయినా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేదు. గతం లో ‘దిశ’ పత్రికలో వచ్చిన వార్త కు స్పందించిన మైనింగ్ అధికారులు ఈటీఎస్ సర్వే చేసి 3 కోట్ల రూపాయల ఫెనాల్టీ వేసిందంటే సదరు సంస్థ ఎంతగా ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతుంది అనే విషయం అర్థం అవుతుంది.
ఓబీ పేరిట మట్టి తవ్వకాలు..
రోడ్డు నిర్మాణం కోసం అవసరమయ్యే మట్టి, మొరం కోసం నిర్మాణ సంస్థలు ప్రత్యేక అనుమతులు తీసుకోవాలి. కానీ ఇక్కడ డీబీఎల్ కంపెనీ గుట్టలను ఖరీదు చేసి ఇందులో మైనింగ్ శాఖ నుంచి బండ రాయి తీయడానికి అనుమతులు తీసుకుని ఓబీ పేరిట కోట్ల రూపాయల మట్టి తవ్వకాలు జరిపారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రాంతం కాకుండా బయట ప్రాంతాలను సైతం చిద్రం చేశాయి.
కొన్న గుట్టలు మాయం.. లీజ్ గుట్టల్లో ఎక్కువ తవ్వకాలు
అధికారికంగా సిరసపల్లి శివారులో 496,270 సర్వే నంబర్లలో గల గుట్టలను రోడ్డు నిర్మాణ సంస్థ అధికారికంగా బండ రాయి తీయడానికి అనుమతులు తీసుకుంది.ఈ గుట్టలను దాదాపుగా మింగేసింది. డీబీఎల్ కంపెనీ తో పాటుగా లోకల్ వాళ్లు సైతం బండరాయిని కంకర కోసం అమ్ముకుంటున్నారు. 274 సర్వే నంబర్ లో గల గుట్టలను లీజుకు తీసుకొని విచ్చల విడిగా బండ రాయితో పాటుగా మట్టి ని కొల్లగొట్టారు.5 ఎకరాల్లో ఉన్న ఈ క్వారీ లో ఎక్కువ మొత్తం లో రాయిని తీసినట్లు ఈ టీ ఎస్ సర్వే లో తేలింది. అయినా అధికారులు కేవలం షోకాజ్ నోటీస్ ల పేరిట కాలక్షేపం చేస్తున్నారు తప్పా చర్యలు తీసుకోవడం లేదు.పెద్ద పెద్ద మిషన్లు, సాంకేతిక పరికరాలతో పెద్ద ఎత్తున గుట్టలను మింగేస్తున్న డీబీఎల్కంపెనీ ఇచ్చే మామూళ్ల కు ఆశ పడిన అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు.
గుట్టలను చీల్చిన డీబీఎల్ కంపెనీ..
నేషనల్ హైవే 563 రోడ్డు నిర్మాణం కోసం సిరసపల్లి శివారులోని పాండవుల గుట్ట పక్కన గల రెండు పెద్ద గుట్టలను చీల్చారు. గుట్టలను చీల్చినందుకు ప్రభుత్వం నుంచి బిల్లు పొందారు. దీనిలో లభించిన రాయి ను కంకరగా మార్చి రోడ్డు నిర్మాణం లో వాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోడ్డు నిర్మాణం కోసం అడ్డం వచ్చిన గుట్టలను చీల్చితే బండ రాళ్లను పక్కన వేలం వేయాలి. కానీ ఇక్కడ ఇలాంటివి ఏవీ జరుగలేదు. ఇంత బహిరంగంగా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినా పట్టించుకున్న దాఖలు లేదు.
కోట్ల రూపాయల మట్టి తవ్వకాలు..
రోడ్డు నిర్మాణం కోసం అవసరమయ్యే మట్టి, మొరం కోసం పెద్ద పెద్ద గుట్టలను మాయం చేస్తున్నారు. అధికారులు అండ తో విచ్చల విడిగా రోజుకు వందల సంఖ్యలో లారీ ల ద్వారా మొరం తవ్వకాలు జరుపుతున్నారు. పాండవులు గుట్ట ను అనధికారికంగా తవ్వి మాయం చేశారు. ప్రకృతి రమణీయంగా ఉన్న ఈ గుట్టను ఛిద్రం చేయడం తో ఈ గుట్టలు ఒక్కోటి తాటి చెట్టంత లోతు లో తవ్వకాలు చేశారు. వీటిలో పశువులు పడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి






