- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోరుట్లలో కత్తిపోట్లు కలకలం
by Bhanu |
తండ్రి కొడుకులు కత్తులతో దాడి చేసుకున్న సంఘటన కోరుట్ల పట్టణంలో గురువారం కలకలం రేపింది.

X
దిశ, కోరుట్ల టౌన్ : తండ్రి కొడుకులు కత్తులతో దాడి చేసుకున్న సంఘటన కోరుట్ల పట్టణంలో గురువారం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే పట్టణానికి చెందిన రాచకొండ దేవ భూమయ్య ను తన కొడుకు నవీన్ చేసిన అప్పులు తీర్చాలని, ఆస్థి పంపకాలు చేయాలంటూ గొడవకు దిగినట్లు తెలిసింది. దీంతో నవీన్ ఇంట్లో కూరగాయలు కోసే కత్తితో తండ్రి దేవ భూమయ్యపై దాడికి చేయడంతో అయన ఎదురుదాడికి చేయడంతో నవీన్ కు వీపు భాగం, మెడపై తీవ్ర గాయాలవ్వగా... దేవ భూమయ్య చేతి బోటనవేలుకు గాయలయాలయ్యాయి. వీరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారిస్తున్నారు.
Next Story






