మాయమవుతున్న మానవ సంబంధాలు.. ! తండ్రిని దారుణంగా చంపిన కొడుకు..

by Bhanu |

మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. అని ఓ సినీ కవి చెప్పునట్లుగా అలంటి సంఘటనే జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో వెలుగు చూసింది.

మాయమవుతున్న మానవ సంబంధాలు.. !  తండ్రిని దారుణంగా చంపిన కొడుకు..
X

దిశ, మేడిపల్లి : మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. అని ఓ సినీ కవి చెప్పునట్లుగా అలంటి సంఘటనే జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో వెలుగు చూసింది. స్వంత తండ్రినే పారతో కొట్టి అతి కిరాతంగా కన్న కొడుకే హత్య చేసాడు. వివరాల్లోకి వెళితే మండల కేంద్రానికి చెందిన అంగడి నర్సయ్య అతడి కుమారుడు వెంకటేష్ ల మధ్య కుటుంబ కలహాలు నడుస్తున్నాయి.

దీనిని దృష్టిలో పెట్టుకుని వెంకటేష్ తన తండ్రి నర్సయ్యను పారతో తలపై బలంగా కొట్టడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు వెంకటేష్ మేడిపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. సంఘటన స్థలాన్ని చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Next Story