ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 8 మందికి తీవ్ర గాయాలు

by Ratna Kumari |

దిశ, తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ రాజీవ్ రహదారి పై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. హైదరాబాద్

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 8 మందికి తీవ్ర గాయాలు
X

దిశ, తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ రాజీవ్ రహదారి పై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి డివైడర్ ని ఢీ కొట్టింది. దీంతో పాటు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొంది. ఈ ప్రమాదం లో బెజ్జంకి మండల రెవెన్యూ సిబ్బంది కలికోట సంతోష్, రమేష్, బెజ్జంకి హెడ్ కానిస్టేబుల్ తడగొండ కనకయ్య తో పాటు మరో కారులో ప్రయాణిస్తున్న పెండ్యాల కిషన్ రెడ్డి, అతని భార్య విజయ,పెండ్యాల దివ్య తో పాటు ఆమె ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. రెవెన్యూ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ ఎన్నికల విధుల్లో భాగంగా వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు.

Next Story