- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులు ఆందోళన చెందొద్దు : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి నియోజకవర్గంలోని రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, చివరి మడి వరకు నీటిని అందించి పంటలు ఎండిపోకుండా కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భరోసా ఇచ్చారు.

దిశ, గంగాధర : చొప్పదండి నియోజకవర్గంలోని రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, చివరి మడి వరకు నీటిని అందించి పంటలు ఎండిపోకుండా కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భరోసా ఇచ్చారు. రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఈఎన్సీ రమేష్ బాబును ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మర్యాదపూర్వకంగా కలిసి చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించిన సాగునీటి సమస్యలపై చర్చించారు.
ముఖ్యంగా గాయత్రి పంప్ హౌస్ నుంచి వరద కాలువకు తక్షణం నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వరద కాలువకు నీటిని విడుదల చేయాలని ఈఎన్సీ రమేష్ బాబుకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల మేరకు ఎల్లుండి గాయత్రి పంప్ హౌస్ నుంచి వరద కాలువకు నీటిని విడుదల చేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికార యంత్రాంగం తెలిపింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. సాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇది ఎంతో ఉపశమనాన్ని కలిగించే నిర్ణయమని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి ఎకరానికి సాగునీరు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తక్షణ చర్యలు తీసుకున్న మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి ఎమ్మెల్యే సత్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.






