- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
రైతులు సాగుచేసి పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడం ద్వారా ఆదాయం పెరుగుతోందని రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

దిశ, చొప్పదండి : రైతులు సాగుచేసి పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడం ద్వారా ఆదాయం పెరుగుతోందని రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. శుక్రవారం వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మొట్ట మొదటి మొక్కజొన్న కొనుగోలు కేంద్రమని తెలంగాణ ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా ఈ కొనుగోలు కేంద్రం నిర్వహించబడుతుందని వెల్లడించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంటను తక్కువ ధరకు అమ్ముకోవద్దని ప్రభుత్వ కల్పించే మద్దతు ధర క్వింటాలకు రూ.2400 లకు వ్యవసాయ మార్కెట్లో అమ్ముకోవాలని సూచించారు. మార్కెట్ చైర్మన్ కొత్తూరి మహేష్, వైస్ చైర్మన్ రాజేందర్, మార్కెట్ కార్యదర్శి రాజేశ్వరి,మున్సిపల్ చైర్పర్సన్ వడ్లూరి సరిత, సీఈఓ కళ్లెం తిరుపతి రెడ్డి,మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు సునీత, రాజేందర్ రెడ్డి, వెంకటేష్, రాజశేఖర్, గంగయ్య, తిరుపతి, అశోక్ మార్కెట్ డైరెక్టర్లు సాంబమూర్తి, శ్రీనివాస్, కొమరయ్య, స్వామి, రవి, సిబ్బంది తిరుపతి, రమణారెడ్డి,శంబయ్య, రాజమౌళి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.






