- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వృథాగా పోతున్న నీటిని చెరువులోకి మళ్లించిన రైతులు
స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన తాండ్రియాల గ్రామ రైతులు

వృథాగా పోతున్న నీటిని చెరువులోకి మళ్లించిన రైతులు
-స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన తాండ్రియాల గ్రామ రైతులు
-హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
దిశ, కథలాపూర్ : గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో కలికోట సూరమ్మ చెరువులో కొంత భాగంలో నీళ్లు రావడం వల్ల ప్రాజెక్ట్ పనులకు అటకంగా ఉండడం కారణంగా అధికారులు నీటిని క్రిందికి వదులుతున్నారు. అలాగే రభి పంట సమయంలో సూరమ్మ ప్రాజెక్ట్ లో చుక్క నీరు ఉండే పరిస్థితి కనపడటం లేదు. కారణం ప్రాజెక్ట్ నిర్మాణం దశలో ఉండడమే. దింతో చుట్టూ ప్రక్కల గ్రామాలకు సైతం భూగర్భ జలాలు లభించే అవకాశం లేదు. ఈ సమయంలో జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామ రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి వృధాగా పోతున్న నీటిని ఒడిసి పట్టి తమ గ్రామ ఊర చెరువు లోకి మల్లించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి వర్షాకాలం ప్రారంభం అయి మూడు నెలలు గడుస్తున్న ఊర చెరువు నిండకపోవడం వల్ల వచ్చే రభి పంటకు ఈ చెరువే జీవనాధారం కావడం అలాగే ఈ చెరువు ద్వారా భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని లేదంటే సాగు నీరు అందడం కష్టమని భావించిన రైతులు ఆ ప్రయత్నంలో భాగంగా సూరమ్మ చెరువు నుండి తాండ్రియాల చెరువులోకి వచ్చే ప్రాంతంలో కొంత భాగం శిదిలావాస్టలో ఉన్న మాటు కాల్వకు ప్రభుత్వం వైపు నుండి ఎలాంటి నిధులను ఆశించకుండా తమ సొంత ఖర్చులతో మరమ్మత్తులు చేసుకుంటున్నారు తాండ్రియాల గ్రామ రైతులు. నీటిని తమ గ్రామ ఊర చెరువు కు మల్లించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






