కొనుగోళ్లు.. కన్నీళ్లు!

by Ratna Kumari |

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బుధవారం సిద్దిపేట- కామారెడ్డి ప్రధాన రహదారిపై అమరవీరుల స్థూపం వద్ద రైతులు ధర్నాకు దిగారు.

కొనుగోళ్లు.. కన్నీళ్లు!
X

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బుధవారం సిద్దిపేట- కామారెడ్డి ప్రధాన రహదారిపై అమరవీరుల స్థూపం వద్ద రైతులు ధర్నాకు దిగారు. కాంగ్రెస్‌ సర్కారు రైతుల ఉసురుపోసుకుంటున్నది. కష్టపడి పండించిన పంటను కొనే దిక్కులేక కన్నీళ్లు పెట్టిస్తున్నది. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వడ్లను సకాలంలో కాంటా పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నది. సంచులు, లేక లారీలు రాక.. కాంటాలు కాక.. కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లను కాపాడుకోవడానికి రోజుల తరబడి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అక్కడే పడిగాపులుగాస్తున్నారు. ఓపిక నశించి సర్కారు నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి ఆందోళనలు చేసినా పట్టించుకునేవారే లేక ఆగమవుతున్నారు. మండలంలో రైతులు అధిక వడ్లు జోకి రైతులు నష్టపోతున్నా కానీ ఇంతవరకు మార్కెట్ చైర్మన్ మా వద్దకు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభం నాడు వచ్చినది తప్ప ఇంతవరకు రైతులను కన్నెత్తి కూడా చూడలేదని, ఆరుగాలం కష్టపడి పండించిన పంట కల్లాల వద్ద నెలలు తరబడి ఉన్నా కానీ పట్టించుకున్న పాపాన పోలేదని, కాంగ్రెస్ నాయకులు కూడా ఇంతవరకు రైతుల వద్దకు వచ్చి తమ బాధను తెలుసుకున్న పాపాన పోలేదని రైతులు మండిపడుతున్నారు. సంఘటన స్థలానికి ఎస్సై అనిల్ కుమార్ చేరుకొని రైతులకు సర్దుబాటు చెప్పి ధర్నా విరవింప చేశాడు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

Next Story