- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల బురదలో ఇరుక్కుని రైతు మృతి
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని నూకపెల్లి గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పొలంలో పని చేస్తుండగా చాతి నొప్పి

X
దిశ, మల్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని నూకపెల్లి గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పొలంలో పని చేస్తుండగా చాతి నొప్పి రావడంతో ఓ రైతు మృతి చెందాడు. నూకపెల్లికి చెందిన ఎనుగందుల గంగారం (75) తన పొలం వద్దకు వెళ్ళాడు. ఈ తరుణంలోనే ఛాతీ నొప్పి రావడంతో కిందపడ్డాడు రైతు. అయితే అతని తల బురదలో ఇరుక్కుంది. దింతో ఊపిరి ఆడక మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు... అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు మల్యాల ఎస్ఐ నరేష్ కుమార్ తెలిపారు.
Next Story






