- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరి కొయ్యలు కాలుస్తూ రైతు దుర్మరణం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.

దిశ, ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎలుక నారాయణ (65) అనే రైతు తన వ్యవసాయ పొలంలో వరి కొయ్యలు కాల్చేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ ఉదయం తన పొలానికి వెళ్లి వరి కొయ్యలకు నిప్పంటించాడు. అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు, కాలుతున్న కొయ్యల నుంచి వచ్చిన దట్టమైన పొగను ఎక్కువగా పీల్చడంతో ఆయనకు ఒక్కసారిగా అస్వస్థత కలిగింది. దీంతో స్పృహ తప్పి కాలుతున్న మంటల్లోనే పడిపోవడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు సమాచారం.
సమీప పొలాల్లో ఉన్న రైతులు పొగ ఎక్కువగా కనిపించడంతో అక్కడికి చేరుకుని చూడగా నారాయణ మృతదేహం మంటల్లో కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి తరలించారు. అందరితో ఆప్యాయంగా కలిసిమెలిసి ఉండే నారాయణ ఆకస్మిక మృతితో తాళ్లపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్థులు, రైతులు పెద్ద సంఖ్యలో చేరుకుని కన్నీటి నివాళులు అర్పించారు.






