సీతారామస్వామిని దర్శించుకున్న ప్రముఖ నటుడు

by Ratna Kumari |

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని సీతారామస్వామి దేవాలయాన్ని మంగళవారం ప్రముఖ నటుడు, దర్శకుడు సి.వి. ఎల్.నరసింహారావు సందర్శించారు.

సీతారామస్వామిని దర్శించుకున్న ప్రముఖ నటుడు
X

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని సీతారామస్వామి దేవాలయాన్ని మంగళవారం ప్రముఖ నటుడు, దర్శకుడు సి.వి. ఎల్.నరసింహారావు సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసినారు. 700 ఏళ్ల నాటి పురాతన ఆలయం సంర్శించడంతో చాలా సంతోషంగా ఉందన్నారు. స్వామి వారి ఆలయ గాలి గోపురం నిర్మాణము కొరకు 10,116 వితరణ చేస్తూ రానున్న రోజుల్లో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ప్రతి ఒక్క భక్తుడు స్వామి వారి ఆలయ గోపురం నిర్మాణానికి తోచినంత ఒక చేయి వేసినట్ట‌యితే సకాలంలో పూర్తి అవుతుందని వారు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం వారిని ఆలయ కమిటి ఆధ్వర్యంలో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందించారు. వీరితో ఆలయ కమిటీ చైర్మన్ మల్లుగారి నర్సాగౌడ్, కోశాధికారి కిషన్, ఆలయ అర్చకులు వేణుశర్మ త‌దిత‌రులున్నారు.

Next Story