- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్సాహంగా పోలీస్ వర్సెస్ జర్నలిస్ట్ క్రికెట్ మ్యాచ్
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆద్వర్యంలో నిర్వహించిన ఐఎంఏ హెల్త్ కప్ ట్రోఫీలో భాగంగా గురువారం పొలీస్ వర్సెస్ జర్నలిస్టుల క్రికెట్ మ్యాచ్ ఆద్యాంతం ఆసక్తిగా కొనసాగింది.

దిశ,పెద్దపల్లి : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆద్వర్యంలో నిర్వహించిన ఐఎంఏ హెల్త్ కప్ ట్రోఫీలో భాగంగా గురువారం పొలీస్ వర్సెస్ జర్నలిస్టుల క్రికెట్ మ్యాచ్ ఆద్యాంతం ఆసక్తిగా కొనసాగింది. రెండు జట్ల మద్య జరిగిన మ్యాచ్ ని ఏసీపీ గజ్జి కృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా ప్రతీ ఉద్యోగి పని ఒత్తిడికి గురికావలసి వస్తుందని దీంతో కొంత మానసిక ప్రశాంతతకు దూరం అవుతాడని, ఇలాంటి క్రీడల వల్ల ఒత్తిడిని దూరం చేసుకోవడానికి, తిరిగి విధులను మరింత ఆసక్తిగా చేసుకోవడానికి తోడ్పడుతాయని అభిప్రాయపడ్డారు. హెల్త్ కప్ నిర్వహిస్తున్న వైధ్యులు రేగళ్ళ రమాకాంత్, ప్రణీత్ తదితరులను ఆయన అభినందించారు.
ఇరుజట్ల హోరాహోరీ పోరు..
పోలీస్ వర్సెస్ జర్నలిస్టుల మ్యాచ్ లో గెలుపు కోసం రెండు జట్లు తీవ్రంగా శ్రమించాయి. అయితే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగంలో అద్భుతంగా రాణించిన పోలీస్ జట్టు 25 పరుగుల తేడాతో జర్నలిస్టుల జట్టును ఓడించి విజయాన్ని అందుకుంది.
సీఐ ప్రవీణ్ హాఫ్ సెంచరీ..
టాస్ గెలిచిన జర్నలిస్టుల జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగుకి దిగిన పోలీస్ జట్టు ఆదిలోనే వికెట్ కోల్పోయింది. కానీ, ఆ తరువాత మరో వికెట్ పడిపోకుండా జాగ్రత్తగా ఇన్నింగ్సును కొనసాగించింది. అద్భుతమైన ఆటతీరుతో సీఐ ప్రవీణ్ హాఫ్ సెంచరీ చేసి జట్టు స్కోరును 10ఓవర్లలో 85 పరుగులకు చేర్చాడు. 86 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జర్నలిస్టు జట్టు రెండో ఓవర్లోనే తొలి వికెట్టును కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వెను వెంటనే వెనుదిరగడంతో నాలుగు వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది. మరోవైపు ఓపెనరుగా బరిలో దిగిన బెజ్జంకి నరేష్ చివరి వరకు ఒంటరిపోరు చేసి 38పరుగులు సాధించి జర్నలిస్టు జట్టు తరపున టాప్ స్కోరరుగా నిలిచాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సీఐ ప్రవీణ్ కు దక్కింది. పోలీస్ క్రికెట్ జట్టు తరపున ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్, ఎస్ఐలు లక్ష్మణ్, నరేష్, మల్లేష్, శ్రవన్, శ్రీధర్, నరేష్, కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి, అలీం, మనోజ్ క్రికెట్ ఆడారు.






