సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం.. మాజీ మంత్రి హరీష్ రావు దిష్టిబొమ్మ దహనం

by Ratna Kumari |

దిశ, గోదావరిఖని : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావును కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.

సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం.. మాజీ మంత్రి హరీష్ రావు దిష్టిబొమ్మ దహనం
X

దిశ, గోదావరిఖని : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావును కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. గురువారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో హరీశ్ రావు దిష్టిబొమ్మను దహనం చేసి కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. రామగుండం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మొక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఈ ప్రాంతానికి పవర్ ప్లాంట్ తీసుకొస్తే ప్రెస్ మీట్ లో హరీశ్ రావు ఇష్టం ఉన్నట్లు మాట్లాడడం సరికాదన్నారు. పవర్ ప్లంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ హరీశ్ రావు మాట్లాడడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతుందన్నారు. ఇకపై బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రాంత అభివృద్ధిపై, కాంగ్రెస్ పార్టీపై మాట్లాడితే సహించేది లేదన్నారు. బీసీ సెల్ అధ్యక్షుడు గట్ల రమేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రామగుండం మున్సిపాల్ కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్, మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, దీటి బాలరాజ్ మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Next Story