ఉపాధి హామీ కూలీలు ఎండకు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి

by Ratna Kumari |

ఉపాధి హామీ కూలీలు ఎండకు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని నిమ్మ‌ప‌ల్లి స‌ర్పంచ్ స్వ‌ప్న నాగ‌రాజు సూచించారు.

ఉపాధి హామీ కూలీలు ఎండకు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి
X

దిశ, కోనరావుపేట : ఉపాధి హామీ కూలీలు ఎండకు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని నిమ్మ‌ప‌ల్లి స‌ర్పంచ్ స్వ‌ప్న నాగ‌రాజు సూచించారు. బుధ‌వారం కోన‌రావుపేట మండ‌లంలోని నిమ్మ‌ప‌ల్లి గ్రామంలో జ‌రుగుతున్న ఉపాధి హామీ ప‌నుల‌ను ఆయ‌న స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. ప‌నులు చేస్తున్న కార్మికుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా స‌ర్పంచ్ స్వ‌ప్న నాగ‌రాజు మాట్లాడుతూ ప్ర‌స్తుతం ఎండ తీవ్ర‌త అధికంగా ఉండ‌టంతో కార్మికుల కోసం గ్రీన్ షెడ్ నెట్స్ ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు. వడదెబ్బకు గురికాకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండ తీవ్రతకు కూలీలు ఎక్కువగా చనిపోతున్నారు అని తెలిపారు. తరచూ నీరు తాగడం, అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అవగాహన కల్పించారు. కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మ‌జ్జిగ‌ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వప్న నాగరాజు, వార్డు సభ్యులు చీకటి మధు, కడారి శ్రీనివాస్, పూజం లావణ్య, ఫీల్డ్ ఆఫీసర్ పూజం లింబయ్య, గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.

Next Story