ఎల్లారెడ్దిపేటలోనూ కంపించిన భూమి.. ఉలిక్కి పడ్డ మండల ప్రజలు

by Bhanu |

ఎల్లారెడ్దిపేట మండలంలో రాత్రి ఏడు గంటలకు రెండు సెకనుల పాటు భూమి కంపించినట్లు పలు గ్రామాల ప్రజలు దిశకు తెలిపారు.

ఎల్లారెడ్దిపేటలోనూ కంపించిన భూమి.. ఉలిక్కి పడ్డ మండల ప్రజలు
X

దిశ, ఎల్లారెడ్దిపేట : ఎల్లారెడ్దిపేట మండలంలో రాత్రి ఏడు గంటలకు రెండు సెకనుల పాటు భూమి కంపించినట్లు పలు గ్రామాల ప్రజలు దిశకు తెలిపారు.ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ఉలిక్కి పడ్డారు. ఒక్కసారిగా భూమి కదలికలు మొదలు కావడంతో ఇంట్లో ఉన్న వంట సామాగ్రి, పలు వస్తువులు కింద పడిపోయాయి.. ప్రజలు ఒక్కసారిగా బయటకు వచ్చి నిల్చున్నారు.ఎలాంటి ప్రమాదం జరుగక పోవడం తో మండల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.మండలంలో మొదటి సారి భూ ప్రకంపనలు రావడం విశేషం.




Next Story