- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాదకరంగా మారిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్
by velandi.Saikiran |
సెయింట్ మెరిస్ పాఠశాల వెనుక ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ చాలా ప్రమాదకరంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

X
దిశ, సుల్తానాబాద్: సుల్తానాబాద్ పరిధిలోని సెయింట్ మెరిస్ పాఠశాల వెనుక ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ చాలా ప్రమాదకరంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం విద్యుత్ ఎర్త్ వైర్ కు కరెంట్ సరఫరా అయ్యి సాయిరాం ఫంక్షన్ హాల్ వారి పెంపుడు కుక్క కరెంట్ షాక్ తో మృతి చెందిందని రైతులు తెలిపారు. అదే స్థానంలో రైతులు కానీ స్కూల్ పిల్లలు ఉంటే ఏమిటి పరిస్థితి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. దీనిపై సుల్తానాబాద్ కరెంట్ ఏఈ, విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసి, మొర పెట్టుకున్నా నిర్లక్ష్యంతో పట్టించుకోకపోవడం లేదని ఆరోపించారు. ఇకనైనా ప్రమాదాలు జరగకుండా చూడాలని, లేని పక్షంలో కలెక్టర్ కు సంబంధిత విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని రైతులు హెచ్చరించారు.
Next Story






