- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చలి మంట కాగుతుండగా విషాదం.. వృద్ధురాలు మృతి !
చలిమంట కాగుతుండగా ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ఓ వృద్ధురాలు చనిపోయింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం

దిశ, గన్నేరువరం : చలిమంట కాగుతుండగా ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ఓ వృద్ధురాలు చనిపోయింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. ఎస్ఐ నరేందర్ రెడ్డి , స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన రామంచ నరసవ్వ{ 85} ఆదివారం ఉదయం ఇంటి ముందే కూర్చిపై కూర్చొని చలిమంట కాగింది. ఈ క్రమంలో మంటవేడికి ఆ ప్లాస్టిక్ కుర్చీ కాలు విరిగిపోవడంతో ఒక్కసారిగా వృద్ధురాలు మంటలో పడిపోయింది. దీంతో నర్సవ్వకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జరుగగానే, అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుంచే ప్రయత్నం చేశారు. కానీ మార్గ మధ్యలో నరసవ్వ చనిపోయింది. మృతురాలి మనవడు బలరాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నరసవ్వకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. గతంలో అనారోగ్యంతో ఇద్దరు కొడుకులు చనిపోయారు. ప్రస్తుతం నరసవ్వ మనవడి దగ్గరే ఉంటోంది.






