వృద్ధురాలి పై దాడి.. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలింపు

by Ratna Kumari |

వృద్ధురాలి పై దాడి చేసిన సంఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

వృద్ధురాలి పై దాడి.. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలింపు
X

దిశ, గంభీరావుపేట : వృద్ధురాలి పై దాడి చేసిన సంఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని బీసీ కాలనీలోని డబుల్ బెడ్ రూమ్ లో నివాసముంటున్న సాయబు గారి పుష్పలత ( 60) పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారు. ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉంటున్న విషయాన్ని గమనించి యువకుడు దాడికి పాల్పడ్డాడు. యువకుడు దొంగతనానికి ఇంట్లోకి వెళ్లి వృద్ధురాలు ప్రతిఘటించడంతో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. తలపై బలంగా దాడి చేయడం వృద్ధురాలికి తీవ్ర రక్తస్రావం అయింది. అప్పుడే ఇంటికి వచ్చిన కుమారుడు తీవ్ర గాయాలతో ఉన్న తన తల్లిని తక్షణం ఆసుపత్రికి తరలించారు. వృద్ధురాలు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డిపేట సీఐ వెంకటేష్, ఎస్సై శ్రీకాంత్ సంఘటన స్థలానికి చేరుకొని పరిసర బ్లాక్ లోని వారిని విచారించారు. దొంగతనానికి వచ్చి వృద్ధురాలిపై దాడి చేసినట్లు తెలిసింది. అనుమానిత యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Next Story