- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎనిమిది మంది పేకాట రాయుళ్ల అరెస్టు
ఎనిమిది మంది పేకాట రాయుళ్లు అరెస్ట్ అయిన సంఘటన కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, కరీంనగర్ రూరల్ : ఎనిమిది మంది పేకాట రాయుళ్లు అరెస్ట్ అయిన సంఘటన కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తీగులగుట్టపల్లి సరస్వతి నగర్ లోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారని పక్క సమాచారంతో దాడులు నిర్వహించి 8 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 53 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులు ప్రకాశం జిల్లా నుంచి కరీంనగర్ కు బ్రతుకు తెరువు కోసం వచ్చి సరస్వతి నగర్ నివాసం ఉంటూ బిల్డింగ్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పట్టుబడినవారిలో తన్నీరు శ్రీను, ఓర్సు సందీప్, తన్నీరు శేషయ్య, పొట్లపాటి అబ్రహం, వల్లెపు రవి, కుంచాల నాగేంద్రబాబు, వల్లెపు పుల్లరాజు, పుల్లపు వెంకటరావు ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామని సీఐ తెలిపారు. .పేకాట స్థావరంపై మెరుపు దాడి చేసి నిందితులను చాకచక్యంగా పట్టుకోవడంతో ఎస్ఐ లక్ష్మా రెడ్డి ని ,సిబ్బంది ని సీఐ అభినందించారు.






