గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి : డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం

by Ratna Kumari |

గ్రామపంచాయతీ సర్పంచ్ లు, అధికారులు సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, తాగు నీటి సమస్యల నివారణకు చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి : డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం
X

దిశ,చొప్పదండి : గ్రామపంచాయతీ సర్పంచ్ లు, అధికారులు సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, తాగు నీటి సమస్యల నివారణకు చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఈ మేరకు శనివారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు, ఉన్నతాధికారుల సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో వేసవిలో నీటి ఎద్దడి నివారణకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించాలని దిశా నిర్దేశం చేశారు. సమస్యలు తీర్చి, ప్రజలకు సౌకర్యాలు కల్పించి, అభివృద్ధి చేసేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. గ్రామాల వారిగా ఉపాధిహామీలో మంజూరి కాబడిన సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్ వాడీ భవనాలు పూర్తి చేయాలని సూచించారు.

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తాము పండించిన పంటను మార్క్ ఫైడ్ ద్వారా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రూ. 8000 లకు అమ్ముకొని ప్రభుత్వం కల్పించే మద్దతు ధరను పొందాలని కోరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 60 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముభారక్ చెక్కులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొత్తూరు మహేష్,వైస్ చైర్మన్ రాజేందర్,మార్క్ ఫైడ్ జిల్లా మేనేజర్ గౌరీ నాగేశ్వర్, కార్యదర్శి రాజేశ్వరి. సీఈఓ తిరుపతి రెడ్డి,ఎంపిడిఓ వేణుగోపాల్ రావు, తహశీల్దార్ నవీన్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి సరిత, వైస్ చైర్ పర్సన్ పెరుమాండ్ల మానస, కౌన్సిలర్లు గుర్రం రాజేందర్ రెడ్డి, కొట్టే సునీత అశోక్, గుర్రం సుజిత్, కునమల్ల రాజశేఖర్, పిట్టల వెంకటేష్, సురేష్,అన్ని గ్రామాల సర్పంచ్ లు, కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.

Next Story