- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చలో అసెంబ్లీ నేపథ్యంలో ఆశా వర్కర్ల ముందస్తు అరెస్టులు
by Ratna Kumari |
జగిత్యాల పట్టణంలో ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఆశా వర్కర్ల హక్కుల సాధన కోసం శనివారం “చలో అసెంబ్లీ” కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు.

X
దిశ, జగిత్యాల రూరల్ : జగిత్యాల పట్టణంలో ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఆశా వర్కర్ల హక్కుల సాధన కోసం శనివారం “చలో అసెంబ్లీ” కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్‌కు వెళ్తున్న 9 మంది ఆశా వర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రతతో పాటు ఇతర న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు అరెస్టులు చేసినట్లు సమాచారం.
Next Story






