- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగం లేక వేదన.. వలసకూలీ ఆత్మహత్య
by Bhanu |
ఉన్న ఊరిలో ఉపాధి లేక బతుకుదెరువు కోసం పరాయి దేశం పోతే అక్కడ కూడా సరైన ఉపాధి లేక జీవితం మీద విరక్తి చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం నింపింది.

X
దిశ,పెగడపల్లి : ఉన్న ఊరిలో ఉపాధి లేక బతుకుదెరువు కోసం పరాయి దేశం పోతే అక్కడ కూడా సరైన ఉపాధి లేక జీవితం మీద విరక్తి చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం నింపింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలం లోని బతికేపల్లి గ్రామానికి చెందిన పూడూరి లచ్చన్న(46) ఉన్న ఊర్లో ఉపాధి కరువై జీవనోపాధి కోసం దుబాయ్ కి వలస వెళ్ళగా అక్కడ కూడా సరైన ఉపాధి లేక ఖర్చులకు కూడా సరిపడని జీతంతో కుటుంబాన్ని పోషించలేక జీవితం మీద విరక్తి చెంది తాను ఉంటున్న క్వార్టర్స్ లో శుక్ర వారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య లత,ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని మృతదేహాన్ని త్వరగా ఇండియా కి వచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కోరుతున్నారు.
Next Story






