- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆందోళన వద్దు..ప్రతి రైతుకు సరిపడా యూరియా అందిస్తాం : మంత్రి అడ్లూరి
యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

దిశ, జగిత్యాల ప్రతినిధి : యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం సాయంత్రం జగిత్యాల కలెక్టరేట్ లో అగ్రికల్చర్ ఆఫీసర్లు, వ్యవసాయ సహకార సంఘాలు, ఎస్సారెస్పీ అధికారులతో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యూరియా విషయమై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో ఇదివరకే మాట్లాడినట్లు అదేవిధంగా ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. గత ఏడాది ఆగస్టు నెల వరకు 23వేల 3 వందల మెట్రిక్ టన్నుల యూరియాను ఆయా గ్రామాల్లో రైతులకు అందజేయడం జరిగిందన్నారు.
పోయిన ఏడాది నుంచి ఇప్పటి వరకు సుమారు 21 వేల మెట్రిక్ టన్నుల యూరియాను సొసైటీల ద్వారా రైతాంగానికి అందజేయడం జరిగిందని తెలిపారు. మరో 2 వేల మెట్రిక్ టన్నుల యూరియా గోదాములో నిల్వ ఉందని అన్నారు. ప్రతి ఒక్క రైతుకు సరిపడా యూరియా అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి రెండు రోజులకోసారి ఎరువులు వస్తుంటాయని రైతులకు వివరించాలని తెలిపారు.






