- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాతది పడగొట్టరు- కొత్తది కట్టరు
శంకరపట్నం మండలంలోని కేశవపట్నం ప్రధాన రహదారి పక్కన పోలీస్ స్టేషన్ ఉండేది. సొంత భవనం నిర్మించి 40 సంవత్సరాలు దాటడంతో ఆ భవనం శిథిలావస్థకు చేరుకుంది.

దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని కేశవపట్నం ప్రధాన రహదారి పక్కన పోలీస్ స్టేషన్ ఉండేది. సొంత భవనం నిర్మించి 40 సంవత్సరాలు దాటడంతో ఆ భవనం శిథిలావస్థకు చేరుకుంది. వర్షాకాలం వచ్చిందంటే పూరి గుడిసెలా కురుస్తుండటంతో పోలీసులు తీవ్ర అసౌకర్యానికి గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భవనం పెచ్చులు ఊడిపోయి ప్రమాదపు అంచున పోలీస్ అధికారులు భయం భయంగా విధులను నిర్వర్తించాల్సి ఉండేది. రక్షకులకు రక్షణ లేకుండా పోతుందని కొన్ని నెలల క్రితం ఏసీపీ మాధవి, సీఐ పులి వెంకట్ లు కలిసి పాత పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలోనే ఓ ప్రైవేటు వ్యక్తికి చెందిన ఇంటిని పరిశీలించి అద్దెకు తీసుకున్నారు. పోలీస్ కమిషనర్ గౌస్ అలాం చేతుల మీదుగా అద్దె భవనంలోకి పోలీస్ స్టేషన్ ను మార్చారు. మారిన ఇంట్లో గదులు చిన్నవిగా ఉండడంతో పోలీసులకు ఇబ్బందిగా మారినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కస్టడికి తీసుకున్న వ్యక్తులను ఉంచడానికి గదులు లేకపోవడం, పోలీసులు భోజనం చేయాలన్న కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. మండల ప్రజలు పలు సమస్యలపై పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించినప్పుడు కనీసం వారు కూర్చోవడానికి సరైన స్థలం లేకపోవడం తో చెట్ల కింద సేద తీరాల్సిన పరిస్థితి. అసలే గదులు తక్కువగా ఉంటే అందులో ఓ గదిని ఎంపీడీవో కార్యాలయ అధికారులు గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. దీంతో మరింత ఇబ్బందిగా మారినట్లు సమాచారం. అసౌకర్యంగా ఉన్న భవనంలో పోలీసులు ఇబ్బందిగానే విధులను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. పాత పోలీస్ స్టేషన్ స్థానంలో కొత్త పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి కావలసిన నిధులను బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మానకొండూర్ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ వీలైనంత తొందరగా మంజూరు చేయించి పాత పోలీస్ స్టేషన్ స్థానంలో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మించి అసౌకర్యాన్ని తొలగించాలని మండల ప్రజలు కోరుతున్నారు.






