- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ నెల 21న ఎంగిలిపూల బతుకమ్మ.. సద్దుల బతుకమ్మ ఎప్పుడో తెలుసా?
ఈ ఏడాది బతుకమ్మ పండుగ ఏ తేదీల్లో వచ్చిందో తెలుసుకుందాం..

దిశ, హుజురాబాద్: పూలను పూజించే పండుగ బతుకమ్మ. ఆడ బిడ్డలందరూ అత్తారింటి నుంచి పుట్టింటికి చేరి తీరొక్క పూలను సేకరించి ఆనందంగా అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఈ బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య రోజు నుంచి ప్రారంభమై.. 9 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది బతుకమ్మ పండుగ ఏ తేదీల్లో వచ్చిందో తెలుసుకుందాం..
హుజురాబాద్ గాయత్రి బ్రాహ్మణ సంఘం బతుకమ్మ, దసరా పండుగల తేదీలు ప్రకటించడం జరిగింది. వారు తెలిపిన పండుగల వివరాల ప్రకారం.. ఈనెల(సెప్టెంబర్) 21న బతుకమ్మ పండుగ ప్రారంభంలో భాగంగా ఆదివారం ఎంగిలి పూల బతుకమ్మ, పెత్తర అమావాస్య, 22న(సోమవారం) దేవి శరన్నవరాత్రులు ప్రారంభం అవుతుందని తెలిపారు. 29న సద్దుల బతుకమ్మ పండుగ (సోమవారం), అక్టోబర్ 02 న(గురువారం) విజయ దశమి (దసరా పండుగ) జరుగుతుందని బ్రాహ్మణ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చెన్నూర్ సురేష్ కుమార్, అనురాగ్ రోహిత్ లు తెలిపారు.






