- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్ ఆస్పత్రులు రూల్స్ ఫాలో కావాల్సిందే
ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు ఎవరైనా సేవా దృక్పథంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియ

దిశ, కరీంనగర్ కలెక్టరేట్: ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు ఎవరైనా సేవా దృక్పథంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం ప్రైవేట్ ఆసుపత్రిల నిర్వాహకులకు "క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, పి.ఎన్.డి.టి చట్టం"పై వర్క్ షాప్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని అన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అత్యవసర మార్గాలు, లిఫ్టులు ఉన్నచోట అదనపు మెట్ల మార్గాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. 10 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉంటే ఐసీసీ కమిటీలు ఏర్పాటు చేయాలని అన్నారు.
ప్రైవేటు అంబులెన్స్లను వారి ఆసుపత్రుల్లోనే నిలుపుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద నిలిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ శాఖకు చెల్లించాల్సిన ఆస్తి పనులను విధిగా చెల్లించాలని అన్నారు. సిజేరియన్ కాన్పులలో కరీంనగర్ ముందుండడం బాధాకరమైన విషయమని అన్నారు. అనవసరంగా సిజేరియన్లు చేయకూడదని, సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీలకు ప్రయత్నించాలని సూచించారు. లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలు వంటివి వెలుగు చూస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సాధారణ డెలివరీలలో ప్రభుత్వ ఆసుపత్రులు ముందు వరుసలో ఉన్నాయని తెలిపారు. గత ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 12 శాతం డెలివరీలు పెరిగాయని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ సనా, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నరేష్, ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు, వైద్యులు పాల్గొన్నారు.






