యువ‌త స్కూల్ పిల్ల‌ల‌కు క్రికెట్ బ్యాట్స్ పంపిణీ

by Ratna Kumari |

కాట్నపల్లి గ్రామం లోని యువత ,స్కూల్ పిల్లలకు క్రికెట్ బ్యాట్స్ యువ నాయకులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ పంపిణీ చేశారు.

యువ‌త స్కూల్ పిల్ల‌ల‌కు క్రికెట్ బ్యాట్స్ పంపిణీ
X

దిశ, సుల్తానాబాద్ : కాట్నపల్లి గ్రామం లోని యువత ,స్కూల్ పిల్లలకు క్రికెట్ బ్యాట్స్ యువ నాయకులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ పంపిణీ చేశారు. వేసవి కాలంలో ఉపయోగకరంగా ఉండాలని మనోజ్ గౌడ్ వేసవి కాలం లో చెడు అలవాట్లకు, మొబైల్ ఫోన్ లకు అలవాటు కాకుండా ఆటలపైన దృష్టి పెట్టాలని ఊరులో ఉన్న అన్ని కాలనీల యూత్ కు క్రికెట్ బ్యాట్స్ అందజేశారు. ఈ సందర్భంగా మనోజ్ గౌడ్ మాట్లాడుతూ నేటి యువత గ్రౌండ్ కు దూరం అవుతున్నారని వారికి మొబైల్ ఫోన్ల పైన దృష్టి ఎక్కువ ఉండటం వలన చెడు వ్యసనాలకు గురి అవుతున్నారని యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, గ్రామీణ క్రీడలకి దగ్గర అవ్వాలని వారి కోసం ఎలాంటి సహాయ సహకారాలు అయిన అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువకులు,స్కూల్ పిల్లలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Next Story