తెగని పంచాయితీ.. పాషిగాంలో అసైన్డ్ భూమిపై వివాదం

by Ajay Maddhiboyina |

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాషిగాం గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమి ఎస్సీ, బీసీల మధ్య తరచుగా గొడవలు రేగుతూ ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. తాజాగా అదే భూమి మాదంటే మాదని గొడవకు దిగుతూ ఇరు వర్గాలు కత్తులు దూసుకుంటున్నారు.

తెగని పంచాయితీ.. పాషిగాంలో అసైన్డ్ భూమిపై వివాదం
X

దిశ, వెల్గటూర్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాషిగాం గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమి ఎస్సీ, బీసీల మధ్య తరచుగా గొడవలు రేగుతూ ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. తాజాగా అదే భూమి మాదంటే మాదని గొడవకు దిగుతూ ఇరు వర్గాలు కత్తులు దూసుకుంటున్నారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సమస్య గురించి రెవెన్యూ అధికారులకు ఇప్పటికే సమాచారమున్న సమస్యను పరిష్కరించకుండా నాన్చుతూ వస్తూ మరింత పెద్దది చేస్తున్నారని అరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఇక్కడే అక్రమంగా ఏర్పాటు చేయాలనుకున్న ఇథనాల్ ఫ్యాక్టరీని ఆపడానికి నెల రోజులకు పైగా తిండి, నీళ్లు మరిచి ఉద్యమం చేసి దానిని తిప్పి పంపించాము. ఉద్యమాలు మాకు కొత్త కాదు ఇప్పుడు న్యాయంగా మేము ఇల్లు కట్టు కోవటానికి అవసరమయ్యే జాగ ఇవ్వకుండా ప్రభుత్వం తమను ఇబ్బంది పెడుతుంది. దీని కోసం మరో ఇథ నాల్ ఉద్యమం చేయడానికి కూడా వెనుకాడమని పాషి గాం గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.

ఈ సమస్య మరింత జటిలం కాక ముందే రెవెన్యూ ఉన్నతాధి కారులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలకు తగిన విధంగా న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాశి గాం గ్రామంలో ని 1090 స. నెంబర్ లోని ప్రభుత్వ భూమి గురించి ఎస్సీ బీసీ ల మధ్యన తరుచుగా గొడవలు జరుగు తున్నాయి. పరిష్కరించాల్సిన అధికారులు పట్టించుకోవటం లేదు. తాజాగా సోమవారం ఇరు వర్గాల మధ్య అదే సీన్ రిపీట్ అయింది. ఇరు వర్గాల ప్రజలు సదరు భూమి మాది అంటే మాదని గొడవకు దిగారు. ఇది మరింత గ్రామంలో శాంతిభద్రతలకు భంగం వాటిలో పరిస్థితులు నెలకొంటున్నాయి. గతంలో దళితుల కోసం ప్రభుత్వం ఎక్సాల్ పట్టాలు ఇచ్చి కొంత మంది కి భూమి పంపిణీ చేశారు. దీనిలో కొందరు భూమిని అనుభవిస్తున్నారు. ఇప్పటికే బీసీలకు ఓ వందకు పైగా గత ప్రభుత్వం ఇంటి స్థలం కోసం పట్టాలు జారీ చేయగా వారంతా ఇల్లు నిర్మించుకున్నారు. కాగా మరో 60 కుటుంబాలకు ఇంటి స్థలం పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఉలుకు పలుకు లేదు. ఉన్న విలువైన స్థలాన్ని దళితులు ఆక్రమించు కోవటం జరుగుతోంది. ఇలాగైతే ఎలా అని బీసీలు, అలాకాదు మాకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన భూమినే మేము వాడు కుంటున్నాము. కొత్తగా ఏది ఆక్రమించు కోలేదని ఎస్సీ లు వాదిస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవలు నిత్యం సర్వసాధారణమై ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి.

పాముకాటు తో పలువురు మృతి

పాత గ్రామాన్ని అనుకొని ఎల్లంపల్లి రిజర్వాయర్ నీరు నిలువ ఉంటుంది. దీని వల్ల తరుచుగా ఊళ్లోకి పాములు, తేళ్లు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు పాము కాటుతో మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. అయినా అధికారులు పట్టించు కోవడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెవెన్యూ అధికారులు గ్రామంలో నీ 40 కుటుంబాలను ఎల్లంపల్లి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద తీసుకుంటామని హామీ ఇచ్చారు. తీరా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయిన తర్వాత అధికారులు చేతులెత్తేసారని మండిపడు తున్నారు. తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా పరిగణించి ముంపు ఎఫెక్ట్ లో ఉన్న 40 కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందజేయాలని బాధిత కుటుంబాల చెందిన వారు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే బాధితులంతా ఏకమై ఇథనాల్ ఉద్యమం లాగ మరో ఉద్యమానికి తెరలేపుతామని ప్రజలు హెచ్చరించారు. రెవెన్యూ ఉన్నతాధికారులు తక్షణమే సమస్యకు సంబంధించిన స్థలాన్ని సందర్శించి ఇరువర్గాలకు నష్టం జరుగకుండా న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

Next Story