- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్.. కదిలిన మండల ఎడ్యూకేషన్ ఆఫీసర్
గోదావరి ఖనిలో మూతపడ్డ పాఠశాలల పేరుతో సాగుతున్న ఫేక్ స్టడీ సర్టిఫికెట్ల దందాపై ప్రచురితమైన కథనానికి స్పందించి.. గురువారం రామగుండం విద్యాశాఖ అధికారులు కదిలివచ్చారు.

దిశ, గోదావరిఖని : గోదావరి ఖనిలో మూతపడ్డ పాఠశాలల పేరుతో సాగుతున్న ఫేక్ స్టడీ సర్టిఫికెట్ల దందాపై ప్రచురితమైన కథనానికి స్పందించి.. గురువారం రామగుండం విద్యాశాఖ అధికారులు కదిలివచ్చారు. దిశా ఎఫెక్ట్‌తో ఎంఈఓ రంగంలోకి దిగడంతో అక్రమంగా సర్టిఫికెట్లు జారీ చేస్తున్న మూతబడిన స్కూళ్ల నిర్వాహకులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మూతపడ్డ పాఠశాలలను స్వచ్ఛందంగా సరెండర్ చేయాలని, ఎలాంటి చెల్లుబాటు అయ్యే ఆధారాలు లేకుండా స్టడీ సర్టిఫికెట్లు జారీ చేస్తే.. సంబంధిత నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎంఈఓ గింక మల్లేష్ స్పష్టంగా హెచ్చరించారు. ప్రత్యేక తనిఖీలు, రికార్డుల పరిశీలన చేపట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు.
స్థానిక నిరుద్యోగులకు ఊరట..
ఈ ఫేక్ సర్టిఫికెట్ల దందా వల్ల స్థానిక నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఇతర ప్రాంతాల వారు అక్రమంగా స్టడీ సర్టిఫికెట్లు పొందుతూ స్థానిక ఉద్యోగాలను కొట్టేస్తుండటంతో గోదావరిఖని యువత ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో కథనంపై అధికారులు స్పందించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి.
కథనానికి కృతజ్ఞతలు తెలిపిన యువత
చాలా రోజులుగా జరుగుతున్న అన్యాయంపై ఎవరూ స్పందించకపోవడం బాధగా ఉందన్నారు. ఇప్పుడు కథనం వల్ల అధికారులు కదిలారు. ఇది మా పోరాటానికి బలం ఇచ్చింది అంటూ పలువురు నిరుద్యోగ యువకులు దిశ పత్రిక యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అక్రమ సర్టిఫికెట్లను పూర్తిగా అరికట్టే వరకు చర్యలు కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.
స్పందించిన సింగరేణి అధికారులు..
తెలంగాణలో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి అధికారులు దిశలో వచ్చిన ఫేక్ స్టడీ సర్టిఫికెట్ల దందాపై అన్ని ఏరియాలోని ఉన్నదా అధికారులు మంచి కథనం ప్రచురితమైందని మాట్లాడుకోవడం, ఈ కథనంపై చర్చించుకుంటున్నారని, దిశ పత్రికలో వస్తున్న కథనాలను అభినందించారని కిందిస్థాయి ఉద్యోగస్తులు దిశ దినపత్రిక కంట్రిబ్యూటర్ కు ఫోన్ చేసి తెలిపారు. ఏది ఏమైనా ఇది ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఈ సమస్య పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తున్నారు.
పర్యవేక్షణ మరింత కఠినం..
విద్యాశాఖ అధికారులు ఇకపై మూతపడ్డ పాఠశాలల రికార్డులు, స్టడీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియపై ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మొత్తానికి, గోదావరిఖనిలో ఫేక్ స్టడీ సర్టిఫికెట్ల దందాపై కథనం తెచ్చిన దిశా ఎఫెక్ట్‌తో అధికారులు కదలడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందన్న ఆశ స్థానికుల్లో బలపడుతోంది.






