దిశ ఎఫెక్ట్ : ఇటుక బట్టీల అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న అధికారులు

by Bhanu |

ఇటుక బట్టీల పేరిట ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు మొదలయ్యాయి.

దిశ ఎఫెక్ట్ : ఇటుక బట్టీల అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న అధికారులు
X

దిశ, కరీంనగర్ రూరల్ : ఇటుక బట్టీల పేరిట ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు మొదలయ్యాయి. కరీంనగర్ మండలంలోని ఇరుకుల్ల గ్రామ పంచాయతీ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మించబడిన వైఎంకే, వీబీసీ, ఎంకేఆర్ ఇటుక బట్టీలపై అధికారుల నిర్లక్ష్యం నేపథ్యంలో దిశ పత్రికలో ప్రచురితమైన కథనాలకు ప్రతిస్పందనగా సోమవారం అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.

గత మార్చిలోనే జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణి ద్వారా కాశీపాక రాకేష్, రమేష్ లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో, ఇటీవల మరోసారి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం, దీని వెంటనే దిశ పత్రిక కథనాల ద్వారా విషయం వెలుగులోకి రావడం, అధికార యంత్రాంగాన్ని కదిలించింది.

దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీవో జగన్ మోహన్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్, పంచాయతీ సిబ్బందితో కలిసి సోమవారం అక్రమ నిర్మాణాలను కూల్చివేత ప్రారంభించారు. అయితే ప్రారంభమైన ఈ చర్యలు పూర్తిస్థాయిలో కొనసాగుతాయా? లేక మధ్యలోనే రాజకీయ ఒత్తిళ్లతో ఆగిపోతాయా? అన్నది ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఏదేమైనా "దిశ ఎఫెక్ట్"తో అక్రమ నిర్మాణాలపై స్పందించిన అధికారులు… ప్రజల్లో ఆశా చిరునవ్వు నింపారు.

Next Story