- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది.

X
దిశ, వీణవంక : తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ఆవుల తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బేతిగల్ గ్రామానికి చెందిన కొక్కిరాల కిషన్ రావు అనే వ్యక్తి తన భార్య చనిపోవడంతో తన సొంత ఇంటిని వదిలి విలువైన వస్తువులన్నీ అద్దె ఇంటిలో ఉంచి మరో చోట కిరాయి ఉంటున్నాడు. దీంతో ఆదివారం తన సొంత ఇంటి వైపు వెళ్లి చూడగా.. ఇంటి తాళాలు పగలగొట్టి ఇంటిలోని వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి. ఇంట్లో ఉన్నటువంటి బంగారం, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయని గమనించిన కిషన్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జమ్మికుంట రూరల్ సిఐ లక్ష్మీ నారాయణ, వీణవంక ఎస్సై సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకుని కిషన్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






