- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ పార్టీలో భగ్గుమన్న విభేదాలు
దిశ,ముత్తారం: ముత్తారం బీఆర్ ఎస్ పార్టీలో భగ్గుమన్న విభేదాలు..గత కొన్ని నెలలుగా లో లోపల నాయకుల మధ్య రగులుతున్నప్పటికి బయటికి మాత్రం రాలేదు... ఆదివారం మండలంలోని ఓడేడు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పోతిపెద్ది కిషన్ రెడ్డి ఇంట్లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతుండగా... బీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది నాయకులు, కార్యకర్తలు మండలాధ్యక్షుడు కిషన్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సభలు సమావేశాలకు మాత్రం కార్యకర్తలు నాయకులు కావాలని... అప్పుడే మండల అధ్యక్షుడు మాకు ఫోన్ చేస్తారని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేటప్పుడు మాత్రం మాకు సమాచారం ఇవ్వారని వారు సభలోనే అధ్యక్షున్ని కొంతమంది నాయకులు నిలదీశారు.
దీంతో వెంటనే కలగజేసుకుని కొంతమంది నాయకులు గోడవను సర్దుమానించారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో మండల స్థాయి నాయకుల మధ్య మనస్పర్ధలు రావడంతో పార్టీలోనే మూడు వర్గాలు విడిపోయినట్లు తెలుస్తుంది. ఒక వర్గం వారు పెత్తనం చెలాయిస్తూ మరో వర్గం వారిని అణచివేస్తున్నారని బహిరంగంగానే ఒక వర్గం వారు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం ముత్తారం మండలం పై ప్రత్యేక దృష్టి సారించి నాయకుల మధ్య రాజీ కుదిరిస్తేనే మంచిదని లేకుంటే ఎలక్షన్ల సమయం లో పార్టీకి నష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉందని పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బహిరంగంగానే తెలుపుతున్నారు.