కంచర్ల లో ప్రబలిన డెంగ్యూ.. 23 మందికి తీవ్ర అస్వస్థత

by Bhanu |

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్న పల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన 23మందికి డెంగ్యూ వ్యాది సోకగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

కంచర్ల లో ప్రబలిన డెంగ్యూ.. 23 మందికి తీవ్ర అస్వస్థత
X

దిశ, ఎల్లారెడ్దిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్న పల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన 23మందికి డెంగ్యూ వ్యాది సోకగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల కంచర్ల గ్రామానికి చెందిన పలువురు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది అనుమానితులకు రక్త పరీక్ష చేయగా 23మందికి డెంగ్యూ సోకినట్లు నిర్దారణ జరిగింది. ఆరోగ్య కేంద్ర నిర్వాహాకులు నిర్దారణ చేయగా డెంగ్యూ భాదితులు జిల్లాలోని వివిధ ప్రయివేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. గతంలో కూడా కంచర్ల గ్రామంలో డెంగ్యూ వ్యాధి సోకగా గ్రామంలో ప్రభుత్వ వైద్యశాలకు పంపించి డెంగ్యూ వ్యాది నిర్దారణ చేయించి ఇంటింటా వైద్యులు నయం అయ్యేలా వైద్య సిబ్బంది తీసుకున్నారు. తిరిగి డెంగ్యూ కంచర్ల లో ప్రబలడంతో గ్రామ ప్రజల్లో అందోళన వ్యక్తమవుతోంది.

Next Story