- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పుల బాధలు తాళలేక గల్ఫ్ కార్మికుడి ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన బొల్లి నర్సయ్య(60)గల్ఫ్ కార్మికుడు శుక్రవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

X
దిశ, వెల్గటూర్: అప్పుల బాధ తాళలేక ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన బొల్లి నర్సయ్య(60)గల్ఫ్ కార్మికుడు శుక్రవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం మృతుడు గతంలో పలుమార్లు బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లొచ్చాడు. దుబాయిలో సరైన ఉపాధి లభించకపోవడంతో అప్పులపాలయ్యాడు.
చేసిన అప్పులు ఏవిధంగా తీర్చాలో తెలియక కుటుంబ సభ్యులు, బంధువుల వద్ద నర్సయ్య తీవ్రంగా మదనపడేవాడని వారుతెలిపారు. దీంతో చేసేదేమీ లేక తీవ్ర మనస్తాపానికి గురై ఇంటి ముందున్న రేకుల షెడ్లో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కూతురు బొల్లి లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కుతరలించి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నరేష్ తెలిపారు.
Next Story






