దిశ ఎఫెక్ట్ : ధరూర్ వాగు బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలు.. కలెక్టర్ సీరియస్

by Bhanu |

జిల్లా కేంద్రానికి సమీపంలోని ధరూర్ వాగు బఫర్ జోన్ లో అక్రమ రోడ్డు ప్రమోషన్, ఎస్సారెస్పీ స్థలాలపై జరుగుతున్న ఆక్రమణలపై

దిశ ఎఫెక్ట్ : ధరూర్ వాగు బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలు.. కలెక్టర్ సీరియస్
X

దిశ, జగిత్యాల కలెక్టరేట్: జిల్లా కేంద్రానికి సమీపంలోని ధరూర్ వాగు బఫర్ జోన్ లో అక్రమ రోడ్డు ప్రమోషన్, ఎస్సారెస్పీ స్థలాలపై జరుగుతున్న ఆక్రమణలపై “దిశ” పత్రిక వెలుగులోకి తీసుకొచ్చిన కథనానికి జిల్లా కలెక్టర్ జి. సత్యప్రసాద్ తీవ్రంగా స్పందించారు. గురువారం ఉదయం ఆయన స్వయంగా ఆక్రమిత ప్రాంతాలను పరిశీలించారు.

బఫర్ జోన్ లో ఏర్పడిన అక్రమ రోడ్డును పరిశీలించిన అనంతరం, కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఎస్సారెస్పీ అధికార స్థలాల్లో ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేపడితే, కోర్టు ద్వారా నోటీసులు జారీ చేయాలని రెవెన్యూ , ఇరిగేషన్ అధికారులకు ఆయన స్పష్టమైన సూచనలు చేశారు.

ఇదే సందర్బంగా పట్టణ శుభ్రతపై డ్రైవ్ నిర్వహించిన కలెక్టర్, మున్సిపల్ పరిపాలనలో భాగంగా నాలాల శానిటేషన్ పై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద డ్రెయిన్‌లు, వాగులు, ప్రభుత్వ భూములపై ఉన్న వ్యర్థాలను శీఘ్రంగా తొలగించాలని మున్సిపల్, రెవెన్యూ, నీటిపారుదల శాఖలతో సమన్వయంగా పని చేయాల్సిన అవసరాన్ని ఆయన సూచించారు.

ప్రైవేటు స్థలాల్లో చెత్త ఉన్నచో యజమానులపై జరిమానాలు విధించి, ఆ డబ్బుతోనే శుభ్రత చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. డ్రైనేజీల్లో ఉన్న ముళ్లకంపలు, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు.

ఈ తనిఖీల్లో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ స్పందన, నీటిపారుదల శాఖ ఈఈ ఎ.హెచ్. ఖాన్, జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో రామ్మోహన్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Next Story