- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జన జీవనం లో కలిసినా దక్కని రివార్డు
ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు తమ సిద్ధాంతాలను వదిలి జన జీవన స్రవంతిలో కలిసిన ప్రభుత్వం నుంచి తమకి ఇస్తా అన్న రివార్డ్ రాక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న ఓ మహిళ మాజీ నక్సలైట్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు తమ సిద్ధాంతాలను వదిలి జన జీవన స్రవంతిలో కలిసిన ప్రభుత్వం నుంచి తమకి ఇస్తా అన్న రివార్డ్ రాక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న ఓ మహిళ మాజీ నక్సలైట్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల కి చెందిన పసుల వసంత 42 సంవత్సరాల క్రితం పీపుల్స్ వార్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి తన భర్త పసుల రామ్ రెడ్డి తో కలిసి పీపుల్స్ పార్టీ లో చేరగా 2000 సంవత్సరంలో తన భర్త చనిపోయినప్పటికి తాను పార్టీ సిద్ధాంతాలను విడవకుండా కొనసాగానని కానీ ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు గత సంవత్సరం జనవరిలో ఛత్తీష్ ఘడ్ లో ప్రభుత్వానికి లొంగిపోగా.. తెలంగాణ, ఛత్తీష్ ఘడ్ రాష్ట్రాల రివార్డులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ ఇప్పటికీ ఎలాంటి సాయం అందలేదని గతంలో కోరుట్ల కాంగ్రెస్ ఇన్ చార్జి జువ్వాడి నర్సింగ రావు తో కలిసి కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం ఉంటున్న ఇల్లు పూర్తిగా కూలిపోయిందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం నుంచి రావాల్సిన రివార్డ్ ఇప్పించాలని పెన్షన్ మంజూరు చేయాలని వేడుకున్నారు.






