కాంగ్రెస్, బీఆర్ఎస్‌లో కోవర్టుల కలకలం.. రాజకీయ పార్టీల్లో అలజడి

by Naga Rani Yarlagadda |

కరీంనగర్ జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో కోవర్టులు కలవరం రేపుతున్నారు. నమ్మిన నాయకులను నట్టేట ముంచుతూ నజరానాలకు అమ్ముడుపోతున్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లో కోవర్టుల కలకలం.. రాజకీయ పార్టీల్లో అలజడి
X

దిశ, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో కోవర్టులు కలవరం రేపుతున్నారు. నమ్మిన నాయకులను నట్టేట ముంచుతూ నజరానాలకు అమ్ముడుపోతున్నారు. తమ పార్టీ సమాచారాన్ని పక్క పార్టీలకు చేరవేస్తూ ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్నారు. నమ్మి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే నావా ఎలా సాగుతుందో చూస్తానంటూ సవాల్ విసురుతున్నారు. పవర్ ఉన్నంత సేపు పక్కలోనే ఉంటూ పవర్ పోగానే పక్కలో బల్లెంలా తయారవుతున్నారు. పదవిలో ఉండగ చేసిన తప్పుల చిట్టా విప్పుతూ ఇరుపార్టీల నేతల మధ్య చిచ్చుపెడుతున్నారు. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన కరీంనగర్ రాజకీయ పార్టీల నేతలు ఇప్పుడు వారి రథచక్రాలను ఎవరైనా విప్పుతున్నారా? అనే భయంతో కొట్టుమిట్టాడుకున్నారు. దీంతో జిల్లాలో రాజకీయ పార్టీల నేతలను ఇప్పుడు కోవర్టుల భయం వెంటాడుతోంది. ఇది ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులకు ఇతర పార్టీలకంటే కోవర్టుల బెడద ఎక్కువగా ఉంది. దీంతో ఎవరు మనవారు?, ఎవరు ప్రత్యర్థుల మనుషులు?, ఎవరిని నమ్మాలి? ప్రత్యర్థి పార్టీల మనుషులను ఎలా గుర్తించాలి? అనే సందిగ్థంలో నలిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక అడుగు ముందుకు వేసి ప్రత్యర్థి పార్టీల్లోని నేతల అవసరాలు, వారి బలహీనతలను పసిగట్టి వారిని దగ్గరకు తీసుకునే పంథాను ఎంచుకుంటున్నారు. నాయకులను మచ్చిక చేసుకునేందుకు వారికి లబ్ధి చేకూర్చే పనిలో నిమగ్నమయ్యారు.

కరీంనగర్ జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో కోవర్టులు కలవరం రేపుతున్నారు. నమ్మిన నాయకులను నట్టేట ముంచుతూ నజరానాలకు అమ్ముడుపోతున్నారు. తమ పార్టీ సమాచారాన్ని పక్క పార్టీలకు చేరవేస్తూ ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్నారు. నమ్మి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే నావా ఎలా సాగుతుందో చూస్తానంటూ సవాల్ విసురుతున్నారు. పవర్ ఉన్నంత సేపు పక్కలోనే ఉంటూ పవర్ పోగానే పక్కలో బల్లెంలా తయారవుతున్నారు. పదవిలో ఉండగ చేసిన తప్పుల చిట్టా విప్పుతూ ఇరుపార్టీల నేతల మధ్య చిచ్చుపెడుతున్నారు. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన కరీంనగర్ రాజకీయ పార్టీల నేతలు ఇప్పుడు వారి రథచక్రాలను ఎవరైనా విప్పుతున్నారా? అనే భయంతో కొట్టుమిట్టాడుకున్నారు.

ఎవరిని నమ్మాలి? ఎలా వ్యవహరించాలి?..

కరీంనగర్ జిల్లాలో రాజకీయ పార్టీల నేతలను ఇప్పుడు కోవర్టుల భయం వెంటాడుతోంది. ఇది ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులకు ఇతర పార్టీలకంటే కోవర్టుల బెడద ఎక్కువగా ఉంది. దీంతో ఎవరు మనవారు?, ఎవరు ప్రత్యర్థుల మనుషులు?, ఎవరిని నమ్మాలి? ప్రత్యర్థి పార్టీల మనుషులను ఎలా గుర్తించాలి? అనే సందిగ్థంలో నలిగిపోతున్నారు. అందుకు ఒక అడుగు ముందుకు వేసి ప్రత్యర్థి పార్టీల్లో లైక్ మైండేడ్ లేదా వారి వారి అవసరాలు, బలం బలహీనతలను పసిగట్టి వారిని దగ్గరకు తీసుకునే పంథాను ఎంచుకున్న నాయకులు వారిని మచ్చిక చేసుకునేందుకు వారికి లబ్ధి చేకూర్చే పనిలో నిమగ్నమయ్యారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు కూడా ఈ పంథానే ఎంచుకోని వారి ప్రత్యర్థులను కట్టడి చేయడంలో సఫలం అయ్యారు. అయితే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం అదే తరహలో వ్యవహరించడం బెడిసి కొట్టి కోవర్టుల బాగోతం బట్టబయలై రెండు రాజకీయ పార్టీల మద్య రగడ మరింత రాజుకుంది. అయితే ఇరు పార్టీల నాయకులు ప్రభుత్వ పథకాల లబ్థిదారుల వివరాలు వెల్లడించడం ఇప్పుడు ఎవరు ఎవరికి కోవర్టు? ప్రత్యర్థి పార్టీల నేతలతో రహస్య సంబంధాలు పెట్టుకోకుండా పథకాలతో లబ్ధిపొందే అవకాశం ఉందా? లేక మనలను మట్టిపెట్టేందుకే వారితో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారా? అనే భయం గుప్పిట్లో నేతలు ఉన్నారు.

నమ్మకస్తుల పరిశీలనలో నాయకులు

తమ వెన్నంటి తిరిగే వారంత మనవారేనా?, ఎవరేవరి బయోడేటా ఏంటి?, మన దగ్గరికి రాకముందు వీరి దినచర్యలు ఏంటి? ఎవరెవరితో సంబంధాలు కలిగి ఉన్నారనే పరిశీలనలో నాయకులు నిమగ్నమయ్యారు. ప్రధానంగా ఈ వాతావరణం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ నేతల్లో ఎక్కువగా ఉంది. మానకొండూర్ నియోజకవర్గంలో మొదటి నుంచి రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం సాగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రాతినిత్యం వహించే నేతలకు అధికారం రావాలన్నా, అధికారం లేకుండా చేయాలన్నా వారిదే కీలక పాత్ర. అక్కడ ఎన్నికయిన ఏ నాయకుడిని అయినా వారే బుట్టలో వేసికుని చక్రం తిప్పుతారానేది అక్కడి నేతల అభిప్రాయం. దీంతో పదవిలో ఉన్న నాయకులు సైతం ఆయా సామాజికవర్గాల నేతలనే చెప్పుచేతల్లో ఉంచుకుని చక్రం తిప్పుతారు. అందుకు అనుగుణంగా ఏ చెట్టుకాడి పాట ఆ చెట్టుకాడ పాడే నేతలకు సైతం కొదువలేదు. దీంతో ఇరుపార్టీల నేతలతో సాన్నిహిత్యం వహించడం కూడా అక్కడి నేతలకు అంతుచిక్కడం లేదు. దీంతో ఎవరిని నమ్మాలో..? ఎవరు మనవారో తేల్చుకునే పనిలో నాయకులు పడ్డారు.

పార్టీ నేత సస్పెన్షన్‌తో వెలుగులోకి..

మానకొండూర్ మండలంలోని కొండపల్కల బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడైన బొల్లం శ్రీనివాస్‌ను ఆ పార్టీ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో ఇరు పార్టీల మధ్య కోవర్టుల బాగోతం వెలుగులోకి వచ్చింది. పార్టీనుంచి బహిష్కరణకు గురైన శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ పథకాలు పొందిన వారి చిట్టా నా దగ్గర ఉంది. దమ్ముంటే సస్పెండ్ చేయాలంటూ సవాల్ విసరగా బీఆర్ఎస్ పార్టీ సైతం కాంగ్రెస్ పార్టీ నేతలో పక్కలో బల్లెంలా వ్యవహరించే వారు ఉన్నారు జాగ్రత్త. మా వద్ద జాబితా ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఎంతమంది లబ్ధి పొందారో చిట్టా ఉంది అంట ప్రతి సవాల్ విసరడం జిల్లాలో చర్చానీయంశంగా మారింది.

Next Story