- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ల నిరసన
వేములవాడ పురపాలక సంఘం కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ అధికారుల తీరును ఖండిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

దిశ, వేములవాడ : వేములవాడ పురపాలక సంఘం కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ అధికారుల తీరును ఖండిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ పుల్కం రాజు అధ్యక్షతన 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. బడ్జెట్ సమావేశానికి సంబంధించి కౌన్సిల్ సభ్యులకు కనీసం వారం రోజుల ముందు సమాచారం ఇవ్వాలని, అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించడంపై బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిల్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సమావేశానికి సంబంధించి మినిట్స్ బుక్ రాయలేదని, వెంటనే మినిట్స్ బుక్, బిల్లు బుక్ రాయాలని డిమాండ్ చేశారు. దీంతో వెంటనే స్పందించిన కమిషనర్ సంపత్ కుమార్ మినిట్స్ బుక్స్ రాస్తామని హామీ ఇచ్చాడు. అయిన్నప్పటికీ వినని కౌన్సిలర్లు కార్యాలయం ముందు బైఠాయించి మినిట్స్ బుక్ రాయకుండా సమావేశం నిర్వహించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. అధికారుల తీరుపై మండిపడ్డారు.






